ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మాత్రం దరిచేరలేకపోయింది. ట్రంప్ శుక్రవారం రాత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 24 గంటల తరువాత ఫలితం నెగిటివ్‌గా వచ్చిందని శ్వేతసౌధం తెలిపింది.
"శుక్రవారం రాత్రి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ట్రంప్‌తో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చివరికి ఆయన కరోనా టెస్ట్‌కు అంగీకరించారు. పరీక్షల్లో ఆయనకు కరోనా సోకలేదని డాక్టర్ సీన్ కొన్లీ స్పష్టం చేశారు."- స్టెఫానీ గ్రిషామ్, శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ