తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​కు జీఎస్​పీ హోదా రద్దు: ట్రంప్​

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే జీఎస్​పీ హోదాను భారత్​కు తొలగించింది అమెరికా. భారతీయ మార్కెట్లో అగ్రరాజ్యానికి సమాన అవకాశాలు కల్పించడంలో భారత్​ విఫలమైనందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షుడు ట్రంప్​ వెల్లడించారు.

భారత్​కు జీఎస్​పీ హోదా రద్దు: ట్రంప్​

By

Published : Jun 1, 2019, 9:51 AM IST

Updated : Jun 1, 2019, 10:09 AM IST

భారత్​కు జీఎస్​పీ హోదాను తిరస్కరించిన ట్రంప్​

భారత్​కు అమెరికా షాక్​ ఇచ్చింది. అమెరికా 'ప్రాధాన్యాల సాధారణ వ్యవస్థ' (జీఎస్​పీ) కింద ఇచ్చే హోదాను భారత్​కు రద్దుచేయాలని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ నిర్ణయించారు. భారతీయ మార్కెట్లో అమెరికాకు సహేతుక, సమాన అవకాశాలు ఇస్తామని మాట ఇవ్వడంలో భారత్​ విఫలం కావడమే ఇందుకు కారణమని చెప్పారు. ఈ నెల 5 నుంచి తన నిర్ణయం అమల్లోకి వస్తుందని ట్రంప్​ స్పష్టం చేశారు.

"భారత మార్కెట్లలో అమెరికాకు నిష్పక్షపాత అవకాశాలు కల్పించడంపై భారత్​ మాట ఇవ్వలేదు. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే జీఎస్​పీ హోదా నుంచి భారత్​ను తొలగించడం తగిన నిర్ణయం."
--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ట్రంప్​ నిర్ణయాన్ని​ అమెరికా కాంగ్రెస్​లోని కీలక చట్టసభ్యులు వ్యతిరేకించారు. హోదాను రద్దు చేయకూడదని పలుమార్లు అభ్యర్థించారు. అధ్యక్షుడు నిర్ణయం అమల్లోకి వస్తే... అగ్రరాజ్యం ఏటా 300 మిలియన్​ డాలర్లు నష్టపోతుందని హెచ్చరించారు.

జీఎస్​పీ హోదా ఉన్న దేశాల్లో అత్యధికంగా లబ్ధిపొందిన దేశం భారత్​. 2017లో జీఎస్​పీ హోదాతో 5.7 బిలియన్లు ఆదా చేసుకుంది.

ఇదీ చూడండి: నీతీశ్​ను ఒప్పించలేకపోయిన 'షా'...

Last Updated : Jun 1, 2019, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details