'ఈ నాలుగేళ్లు ఎంతో అద్భుతంగా గడిచాయి. మరో నాలుగేళ్ల కోసం ప్రయత్నిస్తున్నా. అది కుదరకపోతే.. నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని కచ్చితంగా కలుస్తా....' అమెరికా శ్వేతసౌధంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రిపబ్లికన్లకు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలివి. ఇవి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
వరుసగా మరో దఫా అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగడం అసాధ్యం. ఆయన చేస్తున్న న్యాయపోరాటాలు విఫలమవ్వడమే ఇందుకు కారణం. దీంతో 'మిషన్ 2024'పై ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనపడుతోంది. ఆయన ప్రవర్తన, మాటలు చూస్తే.. ఇందుకోసం ట్రంప్ ఇప్పటికే రంగంలోకి దిగినట్టు అర్థమవుతోంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఏం చేస్తున్నారు?
ఓటమిని అంగీకరించకుండా..
నిజానికి.. ఈ 'మిషన్ 2024' ప్రణాళిక నవంబర్ 3నే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికలు ముగిసిన కొద్ది గంటలకే ట్రంప్ ఓటమి ఖరారైపోయింది. కీలక స్వింగ్ స్టేట్స్లో పట్టుకోల్పోవడం వల్ల మరో రెండు రోజులకే ఆయన పరాజయం లాంఛనమైపోయింది. అయినా.. ఇప్పటికీ తన ఓటమిని అంగీకరించడం లేదు ట్రంప్. ఓ వైపు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్.. పదవిని చేపట్టేందుకు సన్నహాలు చేస్తుంటే.. ట్రంప్ మాత్రం న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అందులోనూ ఓడిపోతున్నారు. కానీ పట్టు మాత్రం వదలడం లేదు. న్యాయపోరాటంలో రిపబ్లికన్లను ముందుండి నడిపిస్తున్నారు.
ఇదీ చూడండి:-అధికార బదిలీకి ట్రంప్ అంగీకారం.. కానీ!
భారీగా నిధులు..
అధ్యక్ష ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే మద్దతుదారులకు భారీగా మెయిల్స్, టెక్స్ట్ మెసేజ్లు పంపించింది ట్రంప్ బృందం. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. న్యాయపోరాటం కోసం నిధులు అందివ్వాలని అభ్యర్థించింది. ఫలితంగా నవంబర్ 3 నుంచి ఇప్పటివరకు ఏకంగా 170మిలియన్ డాలర్లను పోగు చేసింది ఆ బృందం.
'సేవ్ అమెరికా' క్యాంపైన్..