అమెరికా-చైనా రెండో దశ వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాణిజ్య ఒప్పందానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి సమాచారాన్ని చైనా దాచి పెట్టిందని.. అందువల్లే ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే రెండోదశ ఒప్పందంలో చైనాతో పనిచేయడాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు ట్రంప్. ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. కానీ.. వుహాన్ నుంచి పుట్టుకొచ్చిన వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చైనా మరిన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందని ట్రంప్ తెలిపారు.