తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా-ఐరోపా మధ్య ప్రయాణాలు బంద్​ - trump washington

కరోనా వైరస్​ కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఐరోపా దేశాలకు, అగ్రరాజ్యానికి మధ్య రాకపోకలు నిలిపివేశారు.

trump
అమెరికా-ఐరోపా మధ్య ప్రయాణాలు బంద్​

By

Published : Mar 12, 2020, 10:27 AM IST

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఐరోపాకు రాకపోకలు నిలిపేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రానున్న 30 రోజుల్లో బ్రిటన్ మినహా మిగతా ఐరోపా దేశాలకు ప్రజలు వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు శుక్రవారం రాత్రి నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు.

అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటికే 37 మంది చనిపోయి, మరో 1300 మందికి వైరస్ సోకిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. తప్పనిసరైతే తప్ప చైనా, దక్షిణ కొరియాలో పర్యటించకూడదని స్పష్టం చేశారు.

వాషింగ్టన్​లో అత్యయిక స్థితి

వాషింగ్టన్ డీసీ నగరంలో ఇప్పటికే 10 కరోనా కేసులు నమోదైనందున అత్యవసర పరిస్థితి ప్రకటించారు నగర మేయర్ మురియెల్ బౌసర్. వెయ్యికన్నా ఎక్కువ మంది సమావేశం కావడంపై ఆంక్షలు విధించారు. కరోనా దృష్ట్యా మార్చి 20న ప్రారంభం కావాల్సిన ప్రఖ్యాత చెర్రీ బ్లాసమ్​ ఫెస్టివల్​ను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

చైనాలో తగ్గుముఖం

చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ మహమ్మారి కారణంగా చైనాలో బుధవారం 11మంది చనిపోయారు. తాజా మృతులతో చైనాలో మృతుల సంఖ్య 3,169కు చేరింది. వుహాన్​లో కొత్తగా 8 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే... విదేశాల నుంచే వచ్చేవారిలో వైరస్​ బాధితులు ఎక్కువగా ఉండడం చైనా అధికార యంత్రాంగానికి కొత్త సవాలుగా మారింది.

ఇదీ చూడండి:దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details