తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉపాధ్యక్షుడు పెన్స్​పై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు - అధ్యక్షఫలితాలు

అమెరికా ఉపాధ్యక్షుడు, సెనేట్ సభాధ్యక్షుడు మైక్ పెన్స్​పై అధ్యక్షుడు ట్రంప్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడంలో బాధ్యతగా మెలగలేదని అన్నారు. ​

Trump slams Vice President Pence for declining to illegally overturn election results
'దేశ సమగ్రతను కాపడంలో వెనకడు వేశావు'

By

Published : Jan 7, 2021, 12:21 PM IST

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ నేతృత్వంలో రాష్ట్రాల వారీగా ఓట్ల ధ్రువీకరణ ప్రక్రియ సాగుతోంది. ట్రంప్​కు మద్దతుగా పెన్స్ వ్యవహరించకపోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ సమగ్రతను కాపాడంలో పెన్స్​ వెనకడుగు వేశారని ట్రంప్​ అన్నారు. ​

"దేశాన్ని రక్షించడం, రాజ్యాంగాన్ని కాపాడంలో మీరు(మైక్​ పెన్స్​)బాధ్యతగా లేరు. మీరు భయపడుతున్నారు. వాస్తవాలు ప్రజలకు తెలుసు. మోసపూరితంగా ఎన్నికలు జరిగాయి. వాటిన సరిదిద్దే అవకాశం రాష్ట్రాలకు వచ్చింది."

- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

ఘర్షణపై స్పందించిన పెన్స్​

అమెరికాలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ స్పందించారు. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడాన్ని ఖండిచారు. ఘర్షణల ద్వారా ఏమీ సాధించలేమన్నారు. నిరసనలు శాంతియుతంగా ఉంటేనే విజయం సొంత అవుతోందిని తెలిపారు.

"ఈ రోజు జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ క్యాపిటల్​ భవనం వద్ద రిపబ్లికన్​ మద్దతుదారులు ఇలా నిరసనలు తెలపాల్సింది కాదు. మా పదవులు కాపాడటానికి మీరు చేసిన కృషి అభినందనీయం. ఎల్లప్పుడు కృతజ్ఞులం. "

-మైక్​ పెన్స్​, అమెరికా ఉపాధ్యక్షుడు

ఇదీ చూడండి: రణరంగంలా మారిన అమెరికా క్యాపిటల్​ భవనం

ABOUT THE AUTHOR

...view details