అమెరికాలోని మీడియా సంస్థలు, బడా టెక్ కంపెనీలు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుతున్నాయని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం మీడియా వ్యవహరిస్తున్న తీరు పత్రికా స్వేచ్ఛ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఉందని ధ్వజమెత్తారు.
"ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదు. మీడియా చరిత్రలో ఇదొక దురదృష్టకర సమయం. టెక్ సంస్థలు సైతం బైడెన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. బైడెన్‌ది పూర్తిగా అవినీతిమయ జీవితం అని అందరికీ తెలుసు. కానీ మీరు దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల బైడెన్ మీ కంపెనీలకు వెన్నుదన్నుగా ఉంటారని మీరు భావిస్తున్నారు. "
-- డొనాల్డ్ ట్రంప్ ,అమెరికా అధ్యక్షుడు.
'బైడెన్‌కు మద్దతుగా మీడియా'
విస్కాన్సిన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ సైతం మీడియా లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం దేశంలోని మీడియా, టెక్ కంపెనీలు బైడెన్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బైడెన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ప్రచురించటం లేదని మండిపడ్డారు.