ప్రముఖ చైనా యాప్ 'టిక్‌టాక్'పై నిషేధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు. ఈ జాబితాలో మరో దిగ్గజ యాప్ 'వుయ్‌చాట్' కూడా ఉంది.
ఈ యాప్‌లపై నిషేధం మరో 45 రోజుల్లో అమల్లోకి వస్తుంది. జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థకు నష్టం అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు.
"టిక్‌టాక్.. చైనీస్ కంపెనీ బైట్‌డాన్స్‌కు చెందినది. ఇది వినియోగదారుల డేటాను చాలా పెద్దమొత్తంలో సేకరిస్తోంది. దీని ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ అమెరికన్ల వ్యక్తిగత, వ్యాపార సంబంధమైన సమాచారాన్ని పొందుతోంది. ఫెడరల్ ఉద్యోగులు, గుత్తేదారుల లొకేషన్లను గుర్తించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది."