కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన నిరుద్యోగానికి అడ్డుకట్ట వేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఆయన దృష్టి హెచ్-1బీ వంటి వలసదారుల వీసాల మీదే ఉంది. ఈ క్రమంలో ఫెడరల్ ఏజెన్సీలు విదేశీ కార్మికులను, మరీ ముఖ్యంగా హెచ్-1బీ వీసాలో ఉన్న వారిని నియమించకుండా నిరోధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సోమవారం ట్రంప్ సంతకం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
"ఫెడరల్ ప్రభుత్వం అమెరికన్లను మాత్రమే నియమించుకొనేలా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నాను" అని సంతకం పెట్టడానికి ముందు వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. చౌకగా పనిచేసే విదేశీ కార్మికుల కోసం కష్టపడి పనిచేసే అమెరికన్లను తొలగించే నిర్ణయాలను తన పాలనలో సహించనని తేల్చిచెప్పారు.
భారతీయులకు ఎదురుదెబ్బ