అమెరికాలో జాత్యహంకార దాడులపై ఆందోళనలు పెరుగుతున్న వేళ దేశంలో స్మారక చిహ్నాలు, విగ్రహాలను రక్షించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ మేరకు ఉద్దేశపూర్వకంగా విగ్రహాలు ధ్వంసం చేసే వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలకు 10 ఏళ్ల వరకు జైలు శిక్షను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నల్లజాతీయుడు జార్జి ప్లాయిడ్ మృతికి నిరసనగా పెల్లుబికిన ఆందోళనల సందర్భంగా అమెరికాలోని అనేక చోట్ల ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేశారు. శ్వేత సౌధం సమీపంలోని లాఫాయిడ్ పార్కులో మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ విగ్రహాన్ని పగలగొట్టేందుకు సైతం ప్రయత్నించారు.