ఉత్తరకొరియాతో సంబంధాలను బలోపేతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ముందడుగు వేశారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ట్రంప్ లేఖ రాశారు. సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన రెండు దేశాల మధ్య చర్చలు పునరుద్ధరణకు ఆకాంక్షించారు.
కరోనాను ఎదుర్కొందామని కిమ్‌కు ట్రంప్ లేఖ - Trump news
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేఖ రాశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సహకారం అందిస్తామన్నారు.
కరోనాను ఎదుర్కొందామని కిమ్‌కు ట్రంప్ 'ప్రేమ' లేఖ
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఉత్తరకొరియాకు సహకారం అందిస్తామని లేఖలో పేర్కొన్నారు ట్రంప్. ఈ విషయాన్ని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ ఓ ప్రకటనలో చెప్పినట్లు ఉత్తర కొరియా జాతీయ వార్తా సంస్థ తెలిపింది.