తెలంగాణ

telangana

ETV Bharat / international

'బాధ్యతా రాహిత్య అధ్యక్షుడిగా ట్రంప్​ నిలిచిపోతారు'

అమెరికా చరిత్రలో బాధ్యతా రాహిత్యంగా పనిచేసిన అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్​ నిలిచిపోతారని పేర్కొన్నారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. అధికార బదలాయింపును ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రవర్తన వల్ల ప్రజాస్వామ్య దేశాలకు హానికరమైన సందేశం వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Jeo Biden
జో బైడెన్

By

Published : Nov 20, 2020, 12:51 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికార బదలాయింపును ఆలస్యం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత‌ జో బైడెన్‌ అన్నారు. ఈ విధమైన ప్రవర్తన వల్ల ప్రజాస్వామ్య దేశాలకు హానికరమైన సందేశం వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్‌ ప్రతి చర్య గుర్తుంచుకునేలా చేస్తుందన్నారు. అమెరికా చరిత్రలో అత్యంత బాధ్యతా రహితమైన అధ్యక్షుడిగా ట్రంప్ మిగిలిపోతారన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ ఆరోపణలను ఖండించారు బైడెన్. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేకే ట్రంప్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

" అధ్యక్షుడు ట్రంప్ ఉద్దేశం నాకు తెలియదు. కానీ ట్రంప్‌ అమెరికా చరిత్రలో బాధ్యతా రాహిత్యంగా పనిచేసిన అధ్యక్షుడిగా నిలిచిపోతారు. చట్టబద్దంగా గెలిచినప్పటికీ కొన్నింటిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మేము మిషిగాన్​లో గెలిచాము. ఇది ధ్రువీకరణ కాబోతోంది. ఆయన ఎలా ఆలోచిస్తాడు అనే విషయం చెప్పడం చాలా కష్టం. గెలవలేనన్న విషయం ఈపాటికే ట్రంప్‌నకు అర్థమైందని నాకు తెలుసు. జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను."

- జో బైడెన్​, అమెరికా అధ్యక్ష ఎన్నిక విజేత

ఇదీ చూడండి: జార్జియా రీకౌంటింగ్​లో బైడెన్​ ఘనవిజయం

ABOUT THE AUTHOR

...view details