జపాన్‌లో జూన్ నెలలో జరగబోయే జీ-20 దేశాల సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా అధ్యక్షుడితో సమావేశం మంచి ఫలితాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు ట్రంప్.
అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ట్రంప్ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య సానుకూల ఒప్పందం కుదరాలని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.