ఆయన రూటే సేపరేటు. ఆయన మాట ఒక తూటా. ఆయన నిర్ణయాలు సంచలనం. ఎప్పుడు ఎలా మాట్లాడతారో.. ఏం మాట్లాడతారో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పటికే ఆయన ఎవరో తెలిసే ఉంటుంది. ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవల ఆయన చెప్పిన మరో మాట సంచలనమైంది. కరోనా వైరస్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండడం 'గౌరవ సూచిక' అని వ్యాఖ్యానించారు ట్రంప్. ఈ మాటలను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
కరోనాలో అగ్రస్థానం గౌరవంగా భావిస్తున్నా: ట్రంప్ - america corona cases
కరోనా వైరస్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండడం 'గౌరవ సూచిక' అని ఇటీవల వ్యాఖ్యానించారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ . తమ ప్రభుత్వం అత్యంత ఎక్కువ సంఖ్యలో కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తోందని... అందుకే 15 లక్షల కరోనా పాజిటివ్ కేసులను గుర్తించగలిగామని ఈ విషయాన్ని ఆయన సమర్థించుకున్నారు. ట్రంప్ అన్న ఈ మాటలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
కరోనా కేసులు అగ్రస్థానాన్ని గౌరవంగా భావిస్నున్నా: ట్రంప్!