తెలంగాణ

telangana

ETV Bharat / international

'సులేమానీని చంపింది యుద్ధాన్ని ఆపడం కోసమే' - suleman latest news

అమెరికా దౌత్యవేత్తలపై దాడిచేసేందుకు కుట్ర పన్నుతున్నందుకే సులేమానీని మట్టుబెట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ స్పష్టం చేశారు. ఇరాన్​ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని, తమకు ఆ ఉద్దేశ్యం లేదని తెలిపారు.

Trump says US 'terminated' Iranian general but doesn't seek regime change
'ఇరాన్​లో అధికార మార్పిడికి కాదు ఈ దాడి'

By

Published : Jan 4, 2020, 8:33 AM IST

Updated : Jan 4, 2020, 9:36 AM IST

అమెరికా దౌత్యవేత్తలపై దాడిచేసే దిశగా పావులు కదుపుతున్నందుకే ఇరాన్​ అగ్ర కమాండర్ జనరల్​ ఖాసీం సులేమానీని మట్టుబెట్టామని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్​ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అమెరికా ఎప్పుడూ ప్రయత్నించలేదని, తమకు ఆ ఉద్దేశం లేదని తాజా ప్రకటనలో ట్రంప్​ పేర్కొన్నారు.

"సులేమానీ అమెరికా దౌత్యవేత్తలు, సైనిక సిబ్బందిపై దాడి చేసేందుకు కుట్ర పన్నాడు. అందుకే మేము అతన్ని మట్టుబెట్టాం."

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఇరాక్ రాజధాని బాగ్దాద్​లో శుక్రవారం అమెరికా జరిపిన డ్రోన్​ దాడుల్లో ఇరాన్​కు చెందిన కుర్దు దళాల కమాండర్​ మరణించిన నేపథ్యంలో ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్​తో తాను ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు.

"గురువారం రాత్రి మేము యుద్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకున్నాం. యుద్ధం ప్రారంభించడానికి కాదు."

-ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

Last Updated : Jan 4, 2020, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details