తెలంగాణ

telangana

ETV Bharat / international

'కిమ్​ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం'

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ అనారోగ్యంతో బాధపడుతున్నారని వస్తోన్న కథనాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ తప్పుబట్టారు. ఇవన్నీ మీడియా సంస్థలు సృష్టించిన అవాస్తవమైన వార్తలని పేర్కొన్నారు.

Trump says reports on Kim's health 'incorrect'
'కిమ్​ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం'

By

Published : Apr 24, 2020, 10:49 AM IST

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్​ ఉన్​ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఇటీవలే అనేక వార్తలు వినిపించాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ స్పందించారు. కిమ్​ ఆరోగ్యం​పై వస్తోన్న కథనాలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు.

అమెరికాలో కరోనా వ్యాప్తి గురించి వివరించే క్రమంలో ఓ జర్నలిస్ట్​ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ట్రంప్​. ఇవన్నీ మీడియా సంస్థలు సృష్టించిన వార్తలని తెలిపారు.

కిమ్​ ఆరోగ్యం బాగానే ఉందని అనుకుంటున్నా. మేమిద్దరం ఇప్పటికే ఎంతో సఖ్యత కలిగి ఉన్నాం. ఒకవేళ నేను అధ్యక్షుడిగా ఎన్నికవ్వకుండా ఉంటే.. ఉత్తరకొరియాతో మనకు యుద్ధ వాతావరణం నెలకొని ఉండేది. ఆ దేశంతో మాకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి.

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

అధిక ధూమపానం, ఊబకాయం కారణంగా కిమ్​ అస్వస్థతకు గురై, ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆ ఆపరేషన్​ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించిందన్న ఊహాగానాలు వినిపించాయి. వీటిలోని నిజానిజాల్ని తేల్చేందుకు అమెరికా నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details