తాను అభిశంసనకు గురైతే 2020 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి విజయం సాధించటం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డెమొక్రటిక్ చట్టసభ్యులు తనపై అభిశంసన పెట్టేందుకు ప్రక్రియను వేగవంతం చేస్తే వచ్చే ఎన్నికల్లో తన గెలుపు అవకాశాలు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు.
'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో భాగంగా అభిశంసనను మంచి రాజకీయ అస్త్రంగా భావిస్తున్నారా? అనే ప్రశ్నకు 'నేను ఎన్నికల్లో సులభంగా గెలుస్తాననే అనుకుంటున్నా' అని సమాధానమిచ్చారు ట్రంప్.
"2016 ఎన్నికల ప్రచారంపై.. ఎఫ్బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చట్టవిరుద్ధం. నేను ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలు చేయలేదు. నేను తప్పు చేశాననే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేనప్పుడు అభిశంసన చాలా అన్యాయమైన విషయం. మ్యూలర్ నివేదికను పరిశీలిస్తే ఎలాంటి తప్పు జరగలేదని తెలుస్తుంది."