ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నుంచి సానుకూల లేఖ అందిందని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందులోని అంశాలను బహిర్గతం చేయలేదు.
"మా మధ్య మరో సమావేశం ఉంటుందని అనుకుంటున్నా. ఆయన మూడు పేజీల అందమైన లేఖ రాశారు. అది ఆద్యంతం అందమైన లేఖ. అందులోని అంశాలను త్వరలోనే వెల్లడిస్తాను. కానీ అది మంచి సానుకూల లేఖ."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ఇటీవల దక్షిణ కొరియా-అమెరికాకు హెచ్చరికగా ఉత్తర కొరియా క్షిపణ పరీక్షలు చేపట్టినా... కిమ్‌ను వెనకేసుకొచ్చారు ట్రంప్. క్షిపణి పరీక్షలపై కిమ్ సంతోషంగా లేరని చెప్పారు. ఇప్పటి వరకు పరీక్షించిన క్షిపణులు చాలా చిన్నవన్నారు ట్రంప్.