అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థిగా మారే అవకాశమున్న జో బిడెన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యాధిగ్రస్త శునకం కంటే బిడెన్ మెరుగైన వారేనని వ్యాఖ్యానించారు. 'నీవెక్కడ ఉండాలో అక్కడికి నేను మాత్రమే తీసుకెళ్లగలను' అని వ్యాఖ్యానించారు ట్రంప్.
బిడెన్‌పై ఉత్తరకొరియా అనుచిత వ్యాఖ్యలు.. ట్రంప్ వ్యంగ్యం - Slug Trump says N Korea went too far in calling Biden 'rabid dog'
డెమొక్రాటిక్ తరఫున అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న జో బిడెన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు డొనాల్డ్ ట్రంప్. ఉత్తర కొరియా వ్యాఖ్యానించినట్లు బిడెన్ వ్యాధిగ్రస్త శునకం కాదని.. అంతకంటే మెరుగేనన్నారు.
బిడెన్‌పై ఉత్తరకొరియా అనుచిత వ్యాఖ్యలు.. ట్రంప్ వ్యంగ్యం
ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బిడెన్... ట్రంప్, కిమ్‌ల చిత్రాలు ప్రసారం అవుతుండగా నియంతలు-నిరంకుశులను పొగుడుతున్నారు అంటూ యథాలాపంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బిడెన్ తమ అధ్యక్షుడిని అవమానించారని భావించింది ఉత్తరకొరియా. వ్యాధిగ్రస్త శునకాల్లాంటి బిడెన్‌ల వల్లే పెద్దసంఖ్యలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి శునకాలను కర్రలతో కొట్టి చంపాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఇదీ చూడండి: సమాఖ్య గళం బలపడాల్సిన సమయం
TAGGED:
trump on biden