తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నా: ట్రంప్ - donald trump said he is looking forward to visit india

భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మోదీ తన స్నేహితుడని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఆయన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దిశగా చర్చలు జరుపుతామని తెలిపారు.

Trump says looking forward to visiting India
ట్రంప్

By

Published : Feb 12, 2020, 8:31 AM IST

Updated : Mar 1, 2020, 1:32 AM IST

భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నా: ట్రంప్

భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ప్రధాని మోదీ తన స్నేహితుడని.. ఆయన్ను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్రంప్‌ తెలిపారు. తాను ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడానని లక్షలాది మంది తనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని మోదీ తనకు చెప్పారని అగ్రరాజ్య అధినేత వెల్లడించారు.

"నేను ఇండియాకు వెళ్తున్నాను. విమానాశ్రయం నుంచి స్టేడియం(మొతెరా స్టేడియం) వరకు ఐదు నుంచి ఏడు లక్షల మంది(స్వాగతం పలికేందుకు) ఉంటారని ఆయన(నరేంద్ర మోదీ) చెప్పారు. మోదీ నా స్నేహితుడు. ఆయనో గొప్ప వ్యక్తి."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఈ పర్యటనలో భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటారా అన్న ప్రశ్నకు.. అన్నీ సక్రమంగా జరిగితే ఆ దిశగా చర్చలు జరుపుతామని ట్రంప్‌ తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు ట్రంప్‌.

Last Updated : Mar 1, 2020, 1:32 AM IST

ABOUT THE AUTHOR

...view details