ఫేస్బుక్లో అత్యంత ఆదరణ ఉన్న వ్యక్తుల్లో తాను తొలి స్థానం, నరేంద్రమోదీ రెండో స్థానంలో ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారతదేశ పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
"ఇది గొప్ప గౌరవమని అనుకుంటున్నాను. 'ఫేస్బుక్లో తొలి స్థానంలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు' అని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. రెండో స్థానంలో భారత ప్రధానమంత్రి మోదీ ఉన్నారు. రెండు వారాల్లో ఇండియాకు వెళ్తున్నాను. ఈ పర్యటన కోసం ఎదురుచూస్తున్నాను."-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఫేస్బుక్లో తొలి స్థానం సంపాదించడంపై ఇదివరకే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు ట్రంప్. గత నెలలో జరిగిన దావోస్ ఆర్థిక సదస్సులో భాగంగా సీఎన్‌బీసీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం దీనిపై మాట్లాడారు. "నేను ఫేస్బుక్లో నెం.1లో ఉన్నాను. రెండో స్థానం ఎవరో తెలుసా? భారత్ నుంచి మోదీ." అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత పర్యటనకు రానున్నారు డొనాల్డ్ ట్రంప్. న్యూదిల్లీతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను సందర్శించనున్నారు. అక్కడ నిర్వహించే భారీ రోడ్‌షోలో పాల్గొననున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన భారీ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి:ట్రంప్ భారత పర్యటన విజయవంతమవుతుంది.. కానీ!