తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ మళ్లీ ఎన్నికైతే అమెరికా-ఇరాన్​ మధ్య డీల్​..!

నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్​ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్​-యూఏఈ శాంతి ఒప్పందాన్ని ఆయన ప్రశంసించారు. తాను రెండోసారి ఎన్నికైన నెలలోనే అమెరికాతో..​ ఇరాన్​ ఒప్పందం చేసుకుంటుందని స్పష్టం చేశారు.

Trump says Iran will sign a deal with US in the first month of his re-election
ట్రంప్​ మళ్లీ ఎన్నికైతే అమెరికా-ఇరాన్​ మధ్య డీల్​

By

Published : Sep 11, 2020, 1:20 PM IST

అమెరికా నోట్లో ఈ మధ్య బాగా నానుతున్న దేశాల్లో చైనా, ఇరాన్‌ ముందు వరుసలో ఉంటాయి. వీటిపై ట్రంప్ ఓ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పలు అంశాల్లో తిరుగుబాటు చేసిన ఇరాన్‌పై.. ఇప్పటికే కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్​. తాను రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి నెలలోనే.. ఇరాన్​​ ఒప్పందం చేసుకునేందుకు ముందుకొస్తుందని వెల్లడించారు.

" ఈసారి ఎన్నికల్లో నేను గెలిచిన తొలి నెలలోనే అమెరికాతో ఒప్పందానికి ఇరాన్​ ముందుకొస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ దేశ జీడీపీ 25 శాతం దిగువకు పడిపోయింది. కాబట్టి వారు మళ్లీ అద్భుతమైన దేశంగా పురోగమించాలంటే.. ఒప్పందం జరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా"

-- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొల్పడమే తన లక్ష్యమని అభిప్రాయపడ్డారు ట్రంప్​. ఇప్పటికే ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య శాంతి ఒప్పందం చేయగా.. పాలస్తీనా విషయంలోనూ దృష్టి సారించనున్నట్లు తెలిపారు ట్రంప్.

పాలస్తీనాకు ప్రతి ఏటా 750 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అమెరికా అందించేదని చెప్పిన ట్రంప్​.. వారు శాంతి ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల అవన్నీ నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపైనా పునరాలోచిస్తామని అభిప్రాయపడ్డారు ట్రంప్​.

ఇజ్రాయెల్​-యూఏఈ శాంతి ఒప్పందంలో భాగంగా వచ్చే వారం అమెరికా నేతృత్వంలో ఇరుదేశాలు సంతకం చేసుకోనున్నాయి. రెండు దేశాల ప్రతినిధుల బృందాలకు వైట్​హౌస్​లో ట్రంప్​ ఆతిథ్యం ఇవ్వనున్నారు. మధ్య ప్రాచ్యంలోని మిగతా దేశాలు ఇదే మార్గంలో నడుస్తాయని ట్రంప్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే సౌదీ అరేబియా సహా కొన్ని దేశాలతో శాంతి విషయంలో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు ట్రంప్​ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details