భారత్, చైనా, రష్యా దేశాలు వాయు కాలుష్యం గురించి పట్టించుకోవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే అగ్రరాజ్యం మాత్రం ఈ విషయన్ని తీవ్రంగా పరిగణిస్తుందని ఉద్ఘాటించారు. ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి తాను అంగీకరించి ఉంటే అమెరికా పరిస్థితి దారుణంగా ఉండేదని ఇంధన రంగానికి సంబంధించి టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.
"వాయు నాణ్యతను పట్టించుకోవాలని వారందరూ మాకు చెబుతారు. కానీ నిజం చెప్పాలంటే.. భారత్, రష్యా, చైనా వాయు కాలుష్యాన్ని పట్టించుకోవు. కానీ అమెరికా పట్టించుకుంటుంది. నా పాలనలో ఎలాంటి పొరపాట్లు జరగవు. అమెరికానే నా తొలి ప్రాధాన్యం."