తెలంగాణ

telangana

'ఆ మందు మంచిదే.. నేనూ తీసుకుంటున్నా'

By

Published : May 19, 2020, 11:42 AM IST

Updated : May 19, 2020, 12:23 PM IST

తాను హైడ్రాక్సీక్లోరోక్విన్​ను తీసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ తెలిపారు. ఆ ఔషధంతో ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ లేవని చెప్పారు. కరోనాపై పోరుకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగపడదని అనే పరిశోధనలు చెబుతున్నప్పటికీ.. ట్రంప్​ ఈ ఔషధం గురించి ఇంకా గొప్పగా ప్రచారం చేయడం గమనార్హం.

Trump says he's taking malaria drug in case he gets virus
'హైడ్రాక్సీక్లోరోక్విన్​ మంచిదే.. నేను తీసుకుంటున్నా'

హైడ్రాక్సీక్లోరోక్విన్... కరోనా వైరస్​పై పోరులో ఓ గేమ్​ ఛేంజర్​గా అనేక సార్లు అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అయితే ఈ డ్రగ్​తో సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయని అగ్రరాజ్య వైద్య నిపుణులే హెచ్చరిస్తున్నారు. అసలు కరోనాపై పోరుకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగపడుతుందని చెప్పలేమంటున్నారు. అయినప్పటికీ ట్రంప్​ వారిని లెక్క చేయడం లేదు. దాదాపు రెండు వారాలుగా హైడ్రాక్సీక్లోరోక్విన్, జింక్​ను తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. కరోనా వైరస్​ సోకకుండా ముందు జాగ్రత్త కోసం ఇలా చేస్తున్నట్టు పేర్కొన్నారు.

"దీన్ని నాకు వైద్యులు సిఫార్సు చేయలేదు. నేనే శ్వేతసౌధంలోని ఫిజీషియన్​ను అడిగాను. హైడ్రాక్సీక్లోరోక్విన్ మంచిదని నేను అనుకుంటున్నా. అందుకే నేను తీసుకోవడం మొదలుపెట్టాను. ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ లేవు. నేను బాగానే ఉన్నా కదా!"

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ట్రంప్​ ఎంతో ధీమాగా ఉన్నప్పటికీ.. హైడ్రాక్సీక్లోరోక్విన్​తో కరోనా వైరస్​కు చికిత్స చేసినా లాభం లేదని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించాయి.

ఇదీ చూడండి:-గేమ్​ ఛేంజర్​ హైడ్రాక్సీక్లోరోక్విన్​తోనే అధిక మరణాలు!

Last Updated : May 19, 2020, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details