భవిష్యత్తులో కరోనా లాంటి విపత్తు సంభవిస్తే ఎదుర్కొనేందుకు అత్యవసర, నిత్యావసర నిల్వలను పెంచాలన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో ఉత్పత్తి అయ్యే వస్తువులను.. ముందు దేశం కోసం నిల్వ చేసుకున్నాకే ఎగుమతి చేయాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియా, అలెన్‌టౌన్‌లో పర్యటించిన ట్రంప్ ఎగుమతులను తగ్గించి దేశీయ నిల్వలకు ప్రాధ్యాన్యమిస్తామన్నారు. మాస్కులు, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాల ఉత్పత్తిని విస్తృతంగా పెంచుతామన్నారు. భవిష్యత్తులో వచ్చే అధ్యక్షులు దేశంలో నిల్వలు లేక తనలా ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు.
ట్రంప్ ప్రభుత్వం కరోనా విపత్తును ఎదర్కోవడంలో విఫలమైందని.. అమెరికా విజిల్‌బ్లోయర్ రిక్ బ్రైట్ హెచ్చరించిన రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.