తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ చికిత్సతో సూపర్​మ్యాన్​ అయిపోయా: ట్రంప్​ - ట్రంప్​ కరోనా వైరస్​ చికిత్స్​

కరోనాను జయించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​.. తనకు తాను సూపర్​మ్యాన్​గా అభివర్ణించుకున్నారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. తన రోగనిరోధక శక్తిపై గొప్పలు చెప్పుకొన్నారు.

Trump says he feels like 'Superman' after coronavirus treatment
ఆ చికిత్సతో సూపర్​మ్యాన్​ అయిపోయా: ట్రంప్​

By

Published : Oct 14, 2020, 3:51 PM IST

ప్రయోగాత్మక చికిత్స ద్వారా కొవిడ్‌-19 నుంచి కోలుకున్న తాను.. సూపర్‌మ్యాన్‌లా అయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన రోగనిరోధకశక్తిని ప్రశంసించుకున్నారు.

ఈ నెల 1న కరోనా పాజిటివ్ వచ్చిన ట్రంప్‌.. సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందారు. దాదాపు మూడున్నర రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఆ సమయంలో ట్రంప్‌నకు ప్రయోగాత్మకంగా యాంటీబాడీ డ్రగ్‌ల మిశ్రమాన్ని ఇచ్చారు. కొవిడ్​ నుంచి త్వరగానే కోలుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్​​.. ఆ తర్వాత ఎన్నికల సభల్లో పాల్గొనేందుకు వైద్యులు అనుమతిచ్చారు. తాజాగా జాన్స్‌టౌన్ సభలో ప్రసంగించిన ఆయన తనని తాను ఓ సూపర్‌మ్యాన్‌లా అభివర్ణించుకున్నారు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details