అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చట్టసభ్యులను ప్రేరేపించే లాబీయిస్టులు, ధనవంతులు కావడానికి అమెరికా సంపదను దోచుకునే 'వాషింగ్టన్ రాబందుల'కు బైడెన్ సేవకుడని ఆరోపించారు.
సెప్టెంబర్‌లో బైడెన్‌కు భారీగా విరాళాలు అందటంపై ఆడిగిన ప్రశ్నకు ఈ మేరకు వ్యాఖ్యానించారు ట్రంప్. అన్ని రకాల నిధుల సేకరణలో తానే కింగ్ అని... కానీ తనకు అది అవసరం లేదన్నారు. ఒక్క నెలలో 300-350 మిలియన్ డాలర్లు విరాళాలు అందటం వెనక ఒప్పందాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. అలా చేయటం తనకు అవసరం లేదన్నారు.
గత సెప్టెంబర్‌లో బైడెన్‌కు రికార్డు స్థాయిలో 383 మిలియన్ డాలర్లు విరాళాలు అందాయి. ఆగస్టుతో పోల్చుకుంటే భారీగా పెరిగాయి. ట్రంప్‌కు సెప్టెంబర్‌లో 247.8 మిలియన్ డాలర్లు మాత్రమే విరాళాలు వచ్చాయి.