తెలంగాణ

telangana

ETV Bharat / international

గూగుల్​ సాయం అమెరికాకే... చైనాకు కాదు : ట్రంప్ - AMERICA

టెక్​ దిగ్గజ సంస్థ గూగుల్​ అమెరికా సైన్యానికే సాయం అందిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ స్పష్టం చేశారు. గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్​తో భేటీ అనంతరం ట్వీట్ చేశారు ట్రంప్.

గూగుల్​ సాయం అమెరికాకే : ట్రంప్

By

Published : Mar 28, 2019, 3:33 PM IST

అమెరికా సైన్యానికేటెక్​ దిగ్గజ సంస్థ 'గూగుల్'​ సాయం అందిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ అన్నారు. చైనా మిలటరీకి గూగుల్ సహకరించట్లేదని ట్రంప్​ స్పష్టం చేశారు. గూగుల్​ సంస్థ ముఖ్యకార్యనిర్వహణ అధికారి సుందర్ పిచాయ్​తో భేటీ అనంతరం ట్రంప్ ఈ ట్వీట్​ చేశారు.

చైనాలో వ్యాపార​ కార్యకలాపాలు నిర్వహిస్తున్న గూగుల్​... ఆ దేశ సైన్యానికి సాయం అందిస్తోందని కొద్దిరోజుల క్రితమే ట్రంప్​ ఆరోపించారు. గూగుల్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పిచాయ్​తో తొలిసారి భేటీ అయ్యారు ట్రంప్​. గూగుల్​ సంస్థ అమెరికా అభివృద్ధికే కట్టుబడి ఉందని సుందర్​ పిచాయ్​ స్పష్టం చేసినట్లు ట్వీట్​ చేశారు ట్రంప్​.

గూగుల్​ సాయం అమెరికాకే : ట్రంప్

" గూగుల్​ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుందర్​ పిచాయ్​తో భేటీ అయ్యా. గూగుల్​ పూర్తిగా అమెరికా సైన్యానికే సాయం చేయటానికి కట్టుబడి ఉన్నట్లు పిచాయ్​ తెలిపారు. చైనా మిలటరీకి సహకారం అందించట్లేదని స్పష్టం చేశారు.
రాజకీయాలతో పాటు దేశాభివృద్ధికి గూగుల్​ సంస్థ సాయం చేయగలిగే అంశాలపై చర్చించాం. సమావేశం ఆశాజనకంగా జరిగింది."
- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో సామరస్య భేటీ జరిగినందుకు ఆనందంగా ఉందని గూగుల్​ అధికార ప్రతినిధి ప్రకటించారు. ట్రంప్ ట్వీట్​పై సుందర్ పిచాయ్ ఇంకా​ స్పందించలేదు.

"దేశంలో నూతన సాంకేతక పరిజ్ఞాన అభివృద్ధి, ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంతో కలిసి గూగుల్​ చేస్తోన్న ప్రాజెక్టులు తదితర అంశాలపై అధ్యక్షుడితో భేటీలో చర్చించాం."
- గూగుల్​ అధికార ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details