తెలంగాణ

telangana

ETV Bharat / international

జీ7 సదస్సును నా రెసిడెన్సీ​లోనే నిర్వహిస్తా: ట్రంప్​ - ట్రంప్ లేటెస్ట్​ న్యూస్

తన సొంత రిసార్ట్​లో జీ7 సదస్సు నిర్వహించబోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వెల్లడించారు​. వచ్చే ఏడాది జరగనున్న ఈ సదస్సుకు తన అధికారిక 'క్యాంప్​ డేవిడ్' రెసిడెన్సీని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.

trump
డొనాల్డ్​ ట్రంప్​

By

Published : Dec 4, 2019, 9:10 AM IST

జీ7 శిఖరాగ్ర దేశాల సదస్సు నిర్వహణ వేదికపై స్పష్టతనిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. తన అధికారిక క్యాంప్ డేవిడ్​ రెసిడెన్సీలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలుత ట్రంప్​కు చెందిన గోల్ఫ్​ రిసార్ట్​లో జీ7 సదస్సు నిర్వహించాలని భావించినా.. సర్వత్రా విమర్శలు ఎదురవడం వల్ల ఆ వేదికను మార్చారు అమెరికా అధ్యక్షుడు.

లండన్​లో జరుగుతున్న నాటో సదస్సులో భాగంగా జీ7 నాయకులు, కెనడా ప్రధాన మంత్రి జుస్టిసన్​ ట్రుడీయూతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు ట్రంప్.

వచ్చే ఏడాది జూన్​ 10 నుంచి 12 వరకు జీ7 సదస్సు జరగనుంది. తొలుత ఈ సమావేశానికి మియామిలోని ట్రంప్ నేషనల్​ డోరల్​ రిసార్ట్​లో ఆతిథ్యం ఇవ్వాలని అగ్రరాజ్య అధ్యక్షుడు భావించారు. అయితే సొంత లబ్ధికోసమే రిసార్ట్​లో ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కారణంగా వేదికను మారుస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:అమెరికా అధ్యక్ష రేసు నుంచి కమలా హారిస్​ వెనక్కి

ABOUT THE AUTHOR

...view details