సైనిక ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ ఉదయం డిశ్ఛార్జి అయ్యారు. శ్వేతసౌధానికి చేరుకున్న తర్వాత ట్రంప్.. మాస్క్‌ను తీసేయడం చర్చనీయాంశమైంది.
హెలికాఫ్టర్ నుంచి దిగగానే లిఫ్ట్‌లో కాకుండా సౌత్ పోర్టికో మెట్ల నుంచి బ్లూరూమ్ బాల్కనీ ద్వారా శ్వేతసౌధంలోకి చేరుకున్నారు ట్రంప్. బాల్కనీలో తన మాస్కును తీసేసి జేబులో పెట్టుకున్నారు. కింద ఉన్న జనాలను చూస్తూ విజయ సంకేతాన్ని ఇచ్చారు.
కానీ, ట్రంప్ ఆరోగ్యం అప్పుడే పూర్తిగా కుదుటపడలేదని.. శ్వేతసౌధ ఫిజిషియన్ డాక్టర్ సీన్ కోన్లీ చెబుతున్నారు.
"ట్రంప్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని అప్పుడే చెప్పలేం. నేను, మా సిబ్బంది శ్వేతసౌధంలో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక్కడ ఆయనకు ప్రపంచ స్థాయి వైద్యం అందుతుంది."