తెలంగాణ

telangana

ETV Bharat / international

వీసా కొత్త రూల్స్​పై ట్రంప్ క్లారిటీ- ఇక వారికే ఎంట్రీ!

అమెరికాలో శక్తిమంతమైన ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతిభ ఆధారంగా రూపొందించే ఈ చట్టంపై త్వరలో సంతకం చేయనున్నట్లు తెలిపారు.

Trump promises 'strong' immigration act soon
'త్వరలోనే మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ చట్టం'

By

Published : Jul 15, 2020, 5:01 PM IST

ప్రతిభ ఆధారిత వలస విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే ఈ చట్టంపై సంతకం చేయనున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా దేశానికి వచ్చే వలసదారుల పిల్లలకు సంబంధించిన డీఏసీఏ విషయాన్ని పరిశీలించనున్నట్లు స్పష్టం చేశారు.

శ్వేతసౌధంలో మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

"త్వరలోనే ఇమ్మిగ్రేషన్ చట్టంపై సంతకం చేయబోతున్నాను. ఈ చట్టం ప్రతిభ ఆధారంగా, చాలా శక్తిమంతంగా ఉంటుంది. డీఏసీఏ(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్​హుడ్ అరైవల్స్) విషయాన్నీ పరిశీలించబోతున్నాం."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఈ సందర్భంగా డెమొక్రాట్లపై విరుచుకుపడ్డారు ట్రంప్. డీఏసీఏను డెమొక్రాట్లు రాజకీయం కోసం ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. తన ప్రభుత్వం తీసుకురానున్న శక్తిమంతమైన ఇమ్మిగ్రషన్ చట్టాన్ని దేశం 25 ఏళ్లుగా కోరుకుంటోందని చెప్పారు.

సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన వ్యక్తుల పిల్లలను డీఏసీఏ కింద పరిగణిస్తారు. డీఏసీఏ ప్రకారం వీరికి అమెరికాలో పనిచేసుకునే వీలు లభిస్తుంది. దాదాపు 7 లక్షల మందిపై ఈ చట్టం ప్రభావం చూపుతోంది. ఇందులో చాలా వరకు భారత్​, దక్షిణాసియా దేశాలవారే ఉండటం గమనార్హం.

ఇదీ చదవండి-'మోదీజీ... పరువు పోతోంది... అర్థమవుతోందా?'

ABOUT THE AUTHOR

...view details