ఇజ్రాయెల్‌తో యూఏఈ, బహ్రెయిన్ చారిత్రక దౌత్య ఒప్పందాలు చేసుకున్నాయి. ఇజ్రాయెల్‌తో సంబంధాల పునరుద్ధరణలో భాగంగా అమెరికా సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత వహించారు.
ఈ చారిత్రక దృశ్యాలు చూసేందుకు వందల మంది ప్రజలు శ్వేతసౌధంలోని సౌత్ లాన్‌కు విచ్చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, యూఏఈ యువరాజు మహమ్మద్ బిన్ జయేద్లు ట్రంప్ సంమక్షంలో ఈ ఒప్పందం సంతకాలు చేశారు. ఇజ్రాయెల్‌తో సంబంధాల బలోపేతం కోసం ఇతర అరబ్, ముస్లిం దేశాలు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
"చరిత్రను మార్చేందుకు మనం ఇక్కడ సమావేశమయ్యాం. దశాబ్దాల విభజన, సంఘర్షణ తర్వాత పశ్చిమాసియాలో కొత్త ప్రారంభాన్ని మనం చూడబోతున్నాం."