ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిరోధించడానికి చైనా చేపడుతున్న చర్యలు.. ఆ దేశం చూపుతున్న పారదర్శకతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ట్రంప్ అశాభావం వ్యక్తం చేశారు.
"కరోనావైరస్ను నిరోధించడానికి చైనా ఎంతో కృషి చేస్తోంది. చైనా ప్రయత్నాలు, పారదర్శకతను అమెరికా ఎంతో ప్రశంసిస్తోంది. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. అమెరికా ప్రజల తరపున చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.