Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇంజిన్లో లోపం వల్ల ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని న్యూ ఓర్లియాన్స్లో అత్యవసరంగా దింపారు అధికారులు. మెక్సికో గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో ఇంజిన్ పనిచేయటం ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా న్యూ ఓర్లియన్స్లో ల్యాండ్ చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన గత వారాంతంలో జరిగింది.
ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయాన్ని తొలుతో పొలిటికో వార్తాసంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు ధ్రువీకరించారు. అయితే.. ఆ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించలేదు.