అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ 3 'ఎలక్షన డే'కు ఇంకా నాలుగు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో.. శుక్రవారం నుంచి ప్రచారం జోరు మరింత పెంచారు ట్రంప్, బైడెన్. అభ్యర్థులిద్దరూ కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైన మిడ్వెస్ట్ ప్రాంతంలో పర్యటించారు. ఇందులో ట్రంప్ మిచిగాన్‌లోనూ, బైడెన్ లోవాలోనూ పర్యటించారు. అనంతరం ఇద్దరూ విస్కాన్సిన్, మిన్నెసోటా ప్రాంతాల్లో ప్రసంగించారు.
ఆశ.. హెచ్చరిక
తనని ఆశావాదిగా పేర్కొన్న ట్రంప్.. రోజు వందల మంది చనిపోయే పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో చికిత్సలు, టీకాల విషయంలో చాలా ఆశాభావంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ట్రంప్‌పై విమర్శలు గుప్పించిన బైడెన్.. డొనాల్డ్ నిర్ణయాలు వైరస్‌ను మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరించారు. తాము మాత్రం వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇప్పటికే 86 మిలియన్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రంప్, బైడెన్ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. అయితే పలు పోల్స్ సర్వేల ప్రకారం రేసులో బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో...