అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మధ్య మనస్పర్ధలు తొలగిపోయినట్లు కనిపిస్తోంది. వారం రోజుల ఉద్రిక్త పరిస్థితుల తర్వాత తొలిసారి సోమవారం సాయంత్రం ఓవల్ ఆఫీస్‌లో కలుసుకున్నారని అధికారులు తెలిపారు. వీరిద్దరి మధ్య మంచి సంభాషణ జరిగిందని చెప్పారు.
గత నాలుగేళ్లలో సాధించిన విజయాలతో పాటు, తదుపరి వారం పాటు చేపట్టే పనులపై ఇరువురు చర్చించారని ఓవల్ ఆఫీస్ అధికారులు తెలిపారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి అమెరికాలో పరిస్థితికి అద్దం పట్టదని ఇరువురు పేర్కొన్నట్లు చెప్పారు. దేశ ప్రజల కోసం మిగిలిన కాలం పాటు పనిచేసేందుకు ప్రతిజ్ఞ చేసినట్లు స్పష్టం చేశారు. తద్వారా.. 25వ అధికరణ ద్వారా ట్రంప్‌ను అధికారంలో నుంచి తొలగించాలని చేస్తున్న ప్రయత్నాలకు సహకరించనని పెన్స్ సూచన ప్రాయంగా చెప్పినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
విభేదాలు ఇలా..