అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో 15 మందికి క్షమాభిక్షలను ప్రసాదించారు. వీరిలో.. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై 'రాబర్ట్ మ్యూలర్' చేపట్టిన దర్యాప్తులో దోషులుగా తేలిన వారు ఉన్నారు. అదే సమయంలో రిపబ్లికన్ మాజీ చట్టసభ్యులు, 2007 ఇరాక్ విధ్వంసకాండలో దోషులైన మిలిటరీ కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. మరోవైపు క్షమాభిక్షలతో పాటు ఐదుగురికి శిక్షను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్.
తాజాగా.. ట్రంప్ క్షమాభిక్ష పొందిన వారిలో రిపబ్లికన్ పార్టీ మాజీ ప్రచార సహాయకుడు జార్జ్ పాపాడోపౌలోస్తో పాటు కాంగ్రెస్ మాజీ సభ్యులు డంకన్ హంటర్, క్రిస్ కాలిన్స్ ఉన్నారు. ఇరాక్ ఊచకోతలో దోషులుగా తేలిన మరో నలుగురు బ్లాక్‌వాటర్ గార్డ్స్‌కు ట్రంప్ క్షమాభిక్షనిచ్చారు.