తెలంగాణ

telangana

ETV Bharat / international

టిక్​టాక్​కు ఎదురుదెబ్బ.. అమెరికాలోనూ బ్యాన్​

Trump orders clampdown on TikTok and WeChat beginning Sunday, prevents download in the US
టిక్​టాక్​కు ఎదురుదెబ్బ.. అమెరికాలోనూ బ్యాన్​

By

Published : Sep 18, 2020, 5:43 PM IST

Updated : Sep 18, 2020, 6:59 PM IST

17:37 September 18

టిక్​టాక్​కు ఎదురుదెబ్బ.. అమెరికాలో డౌన్​లోడ్​ నిషేధం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ అన్నంతపనీ చేశారు. కరోనా వైరస్‌ మహమ్మారికి కారణమైన చైనా తీరుపై గుర్రుగా ఉన్న అగ్రరాజ్యం.. డ్రాగన్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటనలో పేర్కొంది. 

అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని వాణిజ్య విభాగం కార్యదర్శి విల్‌బర్‌ రోస్‌ వెల్లడించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌కు చెందిన టిక్‌టాక్‌ కంపెనీ 100 మిలియన్ల మంది అమెరికా పౌరుల సమాచారాన్ని యాక్సిస్‌ చేస్తున్న నేపథ్యంలో భద్రతారంగం నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశారు. మిగతా ఆంక్షలను త్వరలోనే వెల్లడిస్తామని వాణిజ్య విభాగం తెలిపింది. 

పొత్తులు కుదరలే..

టిక్​టాక్​ యూఎస్‌ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా.. అమెరికా కంపెనీకి విక్రయించాలని ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. లేదంటే వేటు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు. ఆ తర్వాత టిక్​టాక్​ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపించింది. బైట్‌డ్యాన్స్‌ అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత ఒరాకిల్​- బైట్​డాన్స్​ల మధ్య ఒప్పందం కోసం చర్చలు జరిగినా.. అవి సఫలం కాలేదు.

చైనా దూకుడుతో గల్వాన్‌ సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో టిక్‌టాక్‌, వీచాట్‌తో పాటు వందకు పైగా యాప్‌లపై.. భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Last Updated : Sep 18, 2020, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details