తెలంగాణ

telangana

ETV Bharat / international

యుద్ధం చేస్తున్నాం: అభిశంసనపై ట్రంప్​ వ్యాఖ్యలు - impeachment on trump by democratics

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రైవేటు సమావేశంలో చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం అగ్రరాజ్యంలో రాజకీయ వేడిని మరింత పెంచింది. అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ అభ్యర్థుల్లో ఒకరైన జో బిడెన్​పై బురద జల్లేందుకు ట్రంప్ ప్రయత్నించారన్న వార్తల నేపథ్యంలో అభిశంసన కోసం ఆ పార్టీ పట్టుపడుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ట్రంప్​ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

యుద్ధం చేస్తున్నాం: అభిశంసనపై ట్రంప్​ వ్యాఖ్యలు

By

Published : Sep 29, 2019, 5:11 AM IST

Updated : Oct 2, 2019, 10:09 AM IST

యుద్ధం చేస్తున్నాం: అభిశంసనపై ట్రంప్​ వ్యాఖ్యలు

తనకు వ్యతిరేకంగా డెమొక్రటిక్ పార్టీ నేతలు అభిశంసనకు డిమాండ్ చేయడంపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రైవేటు సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు శుక్రవారం బయటకు వచ్చాయి.

"మనం యుద్ధం చేస్తున్నాం. ప్రజలు కష్టాల్లో ఉన్నారు"అని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను బ్లూమ్​బర్గ్ టీవీ ప్రసారం చేసింది.

అమెరికా దౌత్య రాయబారులతో సమావేశమైన డొనాల్డ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేస్తుండగా ఎవరో చిత్రీకరించి వీడియోను విడుదల చేశారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల నుంచి అభ్యర్థిగా గట్టి పోటీ ఇస్తోన్న జో బిడెన్​పై బురద జల్లేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడ్ని ట్రంప్​ కోరినట్లు ఉన్న ఓ ఫోన్​ సంభాషణ ఇటీవల బయటకు వచ్చింది. ఈ వార్తల ఆధారంగా ట్రంప్​ అభిశంసనకు డెమొక్రాట్లు డిమాండ్​ చేశారు. దీన్ని ఎదుర్కొనేందుకు దౌత్య రాయబారులతో ట్రంప్ సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి సంబంధించిన వీడియో మొట్టమొదటిగా ఎల్​ఏ టైమ్స్​లో ప్రసారమైంది. ఈ ఫోన్​ సమాచారాన్ని ఇచ్చిన అజ్ఞాత వ్యక్తి.. 'గూఢచారి'తో సమానమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులకు కాకుండా భిన్నమైన వాటికి గూఢచర్యం చేయాలన్నారు. జో బిడెన్​ను...దేనికీ స్పందించని రాయిలాంటి వారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రాయబారులు పెద్దగా నవ్వడం కూడా వీడియోలో నిక్షిప్తమయింది. జర్నలిస్టులను జంతువులు అని... మోసపూరితమైన వారని కూడా ట్రంప్ ఈ వీడియోలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్​ ఫోన్​ సంభాషణ వివరాలు లీక్​ చేసిన అజ్ఞాతవ్యక్తికి ప్రమాదం ఉందని డెమోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పాట పాడేందుకు నిరాకరించాడని వివాహిత ఆత్మహత్య..!

Last Updated : Oct 2, 2019, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details