అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అధికారులపై ఆర్థిక, ప్రయాణ ఆంక్షలు విధించేలా కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అఫ్గానిస్థాన్‌లో యుద్ధ నేరాలకు సంబంధించి అమెరికా దళాలు, నిఘా అధికారులను తమ అనుమతి లేకుండానే విచారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విచారణతో ప్రత్యక్షంగా సంబంధమున్న ఐసీసీ అధికారులపై ఆంక్షలు వర్తింపజేయనున్నారు.
తమ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అంతర్జాతీయ సంస్థలపై చర్యలకు ఉపక్రమిస్తూ వస్తున్నారు ట్రంప్. పలు అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాకే పారిస్ ఒప్పందం సహా ఇరాన్ అణు ఒప్పందం, రష్యాతో రెండు ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి అమెరికా వైదొలిగింది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సమాఖ్య, ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థలను వీడింది. ఇంటర్నేషనల్ పోస్టల్ యూనియన్ నుంచి వైదొలుగుతామని బెదిరింపులకు దిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహకారం అందించబోమని ప్రకటించింది. యుద్ధ నేరాలకు జవాబుదారీగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపైనా చర్యలకు దిగుతోంది.
అందుకే ఆంక్షలు..