తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఓటమిని ఒప్పుకోకపోవడం అధ్యక్ష హోదాకు సరికాదు' - జో బైడెన్ అధికార బదిలీ పనులు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం చికాకు కలిగిస్తోందని వ్యాఖ్యానించారు జో బైడెన్. ప్రమాణస్వీకారం రోజు నాటికి పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, ట్రంప్ రెండో ప్రభుత్వానికి అధికార బదిలీ సాఫీగా జరుగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు.

trump-not-conceding-is-an-embarrassment-says-biden
'ట్రంప్ ఓటమిని ఒప్పుకోకపోవడం చికాకు కలిగిస్తోంది'

By

Published : Nov 11, 2020, 8:58 AM IST

ఎన్నికల్లో ఓటమిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించకపోవడం చికాకు కలిగిస్తోందని జో బైడెన్ అన్నారు. అయినప్పటికీ అధికార బదిలీ ప్రణాళికపై ఎలాంటి ప్రభావం లేదని చెప్పారు. ప్రపంచనేతలతో చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు. జనవరి 20(ప్రమాణస్వీకారం రోజు) నాటికి కథ సుఖాంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"సూటిగా చెప్పాలంటే ఇది చాలా చికాకు కలిగిస్తోంది. అధ్యక్షుడి హోదాకు ఇది సరికాదు. అప్పటివరకు(ప్రమాణస్వీకారం) వరకు అధికార బదిలీ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అధ్యక్షుడికి ఓటేసిన రిపబ్లికన్లు సైతం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు."

-జో బైడెన్, అమెరికా తదుపరి అధ్యక్షుడు

తనతో పాటు ట్రంప్​కు ఓటేసిన ప్రజలందరూ ఏకతాటిపైకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు బైడెన్.

"మెజారిటీలో తక్కువ వ్యత్యాసం ఉంది. చాలా మంది ఆయనకూ ఓటేశారు. వారంతా ఐక్యంగా ఉండేందుకు సిద్ధపడ్డారని భావిస్తున్నాను. గత ఆరేడేళ్లుగా మనం చూస్తున్న ఈ కఠినమైన రాజకీయాల నుంచి దేశాన్ని బయటకు తీసుకురాగలమని నమ్ముతున్నా."

-జో బైడెన్, అమెరికా తదుపరి అధ్యక్షుడు

విజయం తర్వాత ప్రపంచ నేతల నుంచి మంచి స్పందన వచ్చిందని బైడెన్ అన్నారు. ఆయా దేశాల నేతలతో చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అమెరికాను గౌరవప్రదమైన స్థానంలోకి తిరిగి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ట్రంప్ ప్రభుత్వానికే అధికార బదిలీ

మరోవైపు డొనాల్డ్ ట్రంప్ రెండో ప్రభుత్వానికి అధికార బదిలీ సాఫీగా జరుగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్నారు. ఎన్నికల్లో ట్రంప్ గెలిచారని సూచించేలా ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని ఓట్లను లెక్కించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.

"ట్రంప్ రెండో ప్రభుత్వానికి అధికార బదిలీ సాఫీగా జరుగుతుంది. దానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంతో ప్రపంచం మొత్తం చూస్తోంది. మేం అన్ని ఓట్లను లెక్కిస్తాం."

-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

ఎన్నికల్లో భారీగా మోసాలు జరిగాయా అని పాత్రికేయులు ప్రశ్నించగా.. ఈ విషయంపై ప్రపంచ నలుమూలల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. న్యాయ ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పడుతుందని అన్నారు. 2000 ఎన్నికల్లో ఫలితం తేలేందుకు 37 రోజులు పట్టిందని, అప్పుడు అధికార బదిలీ విజయవంతంగా చేపట్టామని గుర్తు చేశారు.

For All Latest Updates

TAGGED:

says Biden

ABOUT THE AUTHOR

...view details