తెలంగాణ

telangana

ETV Bharat / international

'నోబెల్​ శాంతి బహుమతి' రేసులో ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ 'నోబెల్​ శాంతి బహుమతి 2021'కి నామినేట్ అయ్యారు. యుఏఈ-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసినందుకు నార్వే పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్‌ ట్రైబిడ్రే జెడ్డే ట్రంప్​ పేరును ప్రతిపాదించారు.

Trump nominated for Nobel Peace Prize
'నోబెల్​ శాంతి బహుమతి'కి ట్రంప్ నామినేట్​

By

Published : Sep 9, 2020, 4:43 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. 2021 ఏడాదికిగానూ నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. ఇజ్రాయెల్‌, యూఏఈ మధ్య ఒప్పందం కుదిర్చినందుకు నార్వే పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్‌ ట్రైబిడ్రే జెడ్డే ఆయన పేరును ప్రతిపాదించారు. ఇరు దేశాల మధ్య సామరస్యం నెలకొనేలా చేశారని కితాబిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ట్రంప్‌ను ప్రశంసించారు క్రిస్టియన్. పశ్చిమాసియా నుంచి భారీ సంఖ్యలో అమెరికా దళాలను.. ట్రంప్‌ ఉపసంహరించుకొనేలా చేశారన్నారు.

ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతిని ఇవ్వాలంటూ.. ఆయనకు మద్దతుగా ట్రైబిడ్రే జెడ్డే మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ.. ఆయన ట్రంప్‌ను నామినేట్‌ చేశారు. అయితే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఆయన పేరును నామినేట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నోబెల్‌ శాంతి బహుమతి పొందారు.

ABOUT THE AUTHOR

...view details