అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ కోసం శ్వేత సౌధంలో ఓ లేఖను ఉంచి వెళ్లారు డొనాల్డ్ ట్రంప్. సాధారణంగా పదవి నుంచి దిగిపోయే తరుణంలో అధ్యక్షులు తదుపరి వారసుల కోసం ఇలా లేఖను రాయడం అక్కడ ఆనవాయితీ. అందులో అభినందన పదాలు, మద్దతు సందేశాలతో సహా.. వారి పదవీ కాలానికి శుభాకాంక్షలు వంటివి ఉంటాయి. అయితే.. తన అధ్యక్ష పదివిని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని ట్రంప్.. బైడెన్‌కు లేఖలో ఏం రాసి ఉంటారన్నది ఆసక్తి రేపుతోంది.
బైడెన్‌కు ప్రేమతో ట్రంప్ రాయునది ఏమనగా! - డొనాల్డ్ ట్రంప్ తాజా వార్తలు
అమెరికా అధ్యక్షుడిగా పదవిని వదిలి వెళ్తూ.. శ్వేత సౌధంలో బైడెన్ కోసం ఓ లేఖ రాసి ఉంచారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా సంప్రదాయం ప్రకారమే ట్రంప్ ఇలా చేసినప్పటికీ.. శాంతియుత అధికార బదిలీకి నిరాకరించిన ట్రంప్.. అందులో ఏమి రాసి ఉంటారా అనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తదుపరి అధ్యక్షుడు బైడెన్‌కు ప్రేమతో... :-ట్రంప్
శాంతియుతంగా అధికార బదిలీ చేపట్టాల్సిన తరుణంలో.. ట్రంప్ దాన్ని దుర్వినియోగం చేశారు. క్యాపిటల్ భవనం వద్ద జరిగిన బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాని ట్రంప్.. అంతకుముందే శ్వేత సౌధాన్ని వీడారు. మెలానియా ట్రంప్‌తో కలిసి ఫ్లోరిడాకు డొనాల్డ్ ట్రంప్ వెళ్లిపోయారు.
ఇదీ చదవండి:'ఇప్పుడు వెళ్తున్నా.. మళ్లీ వస్తా'