అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నూతనంగా ఎన్నికైన జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. స్థానికంగా పెరుగుతోన్న హింసను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధం వర్గాల వెల్లడించాయి. ఈ ఆదేశాలు జనవరి 24 వరకు అమలులో ఉంటాయి.
ఈ నిర్ణయంతో హోంశాఖ, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీలు.. స్థానిక అధికారులు కలిసి సమన్వయంతో పని చేయనున్నాయి. క్యాపిటల్ వద్ద గురువారం జరిగిన అల్లర్లలో అయిదుగురు మరణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి ట్రంప్ ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపిస్తున్నారు. కానీ వాటిని అధికారుల ఇప్పటికే ఖండించారు.