స్వలాభం, ధనవంతులైన స్నేహితులకు సాయం చేసేందుకే మరోమారు అమెరికా అధ్యక్షుడు కావాలని డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని ఆరోపించారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. సాధారణ పౌరుల గురించి ట్రంప్‌కు పెద్దగా పట్టింపులేదని విమర్శించారు. బైడెన్, హ్యారిస్ మాత్రం అందరికోసం పోరాడుతున్నారని కితాబిచ్చారు.
డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతుగా ఫ్లోరిడాలో ప్రచారం నిర్వహించారు ఒబామా.
"వాళ్ల(బైడెన్, హ్యారిస్) చుట్టూ లాబీ చేసేవాళ్లు, ప్రముఖులు లేరు. మీ మంచి కోరే వ్యక్తులే వారి చుట్టూ ఉంటారు. ఇదే వారి ప్రత్యర్థులకు, వారికి ఉన్న తేడా. వాళ్లు నిజంగా అమెరికన్ల కోసం ఆలోచిస్తారు."
-- ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు