తెలంగాణ

telangana

ETV Bharat / international

రండి.. సంతకం చేయండి: జిన్​పింగ్​కు ట్రంప్​ లేఖ - రండి.. సంతకం చేయండి: జిన్​పింగ్​కు ట్రంప్​ లేఖ

అమెరికా- చైనా మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందం కుదిరే దిశగా అమెరికా-చైనా చర్చలు జరుగుతున్నాయి. ఒప్పందం కుదిరితే.. సంతకం చేయడానికి చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ను ట్రంప్​ ఆహ్వానించారు. ఈ విషయాన్ని వైట్​హౌస్​ అధికారులు వెల్లడించారు.

రండి.. సంతకం చేయండి: జిన్​పింగ్​కు ట్రంప్​ లేఖ

By

Published : Nov 5, 2019, 6:18 PM IST

అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్యం యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యం సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరయిపోతోంది. వాణిజ్య యుద్ధాన్ని ముగించడానికి ఇరు దేశాల మధ్య అనేకమార్లు చర్చలు జరిగినా విఫలమయ్యాయి. తాజాగా ఈ రెండు దేశాల మధ్య మొదటి దశ వాణిజ్యం ఒప్పందం ఖరారయ్యేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​కు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ లేఖ రాశారు. ఒప్పందం కుదిరినప్పుడు.. దానిపై సంతకం చేయటానికి జిన్​పింగ్​ను ట్రంప్​ ఆహ్వానించినట్టు శ్వేతసౌధ అధికారులు తెలిపారు.

'మొదటి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా మా చర్చలు జరుగుతున్నాయి. ఒప్పందంపై సంతకం చేయటానికి చైనా అధ్యక్షుడిని ట్రంప్​ ఆహ్వానించారు. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి. ఈ విషయంపై ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ఒప్పందం జరగాలని కోరుకుంటున్నా. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలుండాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఇరు దేశాలకు మంచిది. చైనాతో సంబంధాలను మరింత మెరుగు పరుచుకోవాలని అనుకుంటున్నాం. కానీ వారి ప్రవర్తన అలా లేదు. ఇలాంటి ప్రవర్తన వల్ల స్నేహ సంబంధమైన దేశాలకు న్యాయం జరగదు. ఈ విషయం చెప్పటానకి మేము సిగ్గుపడటం లేదు.
-రాబర్ట్ ఓబ్రెయిన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు.

అంతర్జాతీయ జలాల సమస్యపైనా స్పందించారు రాబర్ట్​. పెసిఫిక్​కు సంబంధించి అంతర్జాతీయ జలాల విషయంలో.. సముద్ర జలాలు తమలో భాగమని ఏ ఒక్క దేశమూ అనకూడదని అభిప్రాయపడ్డారు.

సముద్ర మార్గం ద్వారా అమెరికా వాణిజ్య వ్యాపారం చేస్తుందని తెలిపారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం అగ్రరాజ్యనికి సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం చేయటానికి అనుమతి ఉందని వెల్లడించారు. ఆగ్నేయాసియా దేశాల సహజ వనరులు, వారసత్వం, భవిష్యత్తు, వారి ప్రత్యేక ఆర్థిక మండలాలకు అమెరికా ఇబ్బంది కలిగించదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఆడియో క్లిప్పులపై యడియూరప్పకు సుప్రీం షాక్!

ABOUT THE AUTHOR

...view details