చైనాపై మరోసారి ఆంక్షల అస్త్రాలను సంధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డ్రాగన్ సైన్యానికి మద్దతిచ్చే చైనా కంపెనీల్లో అమెరికా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టకుండా నిషేధించే కార్యానిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు. దీనిపై జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్ అధికారిక ప్రకటన చేశారు.
"చైనా మిలిటరీతో సంబంధం ఉన్న చాలా సంస్థలు స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేస్తున్నాయి. అమెరికా పెట్టుబడిదారులు తెలియకుండా అందిస్తున్న మూలధనంతో చైనా ప్రభుత్వం, సైన్యానికి నిఘా సేవలను పెంచుకుంటోంది. వీటి ద్వారా అమెరికా ప్రజలు, వ్యాపారులు లక్ష్యంగా చైనా నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో నుంచి అమెరికన్లను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. "