తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫిబ్రవరి 8 నుంచి ట్రంప్​ అభిశంసనపై విచారణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసనపై.. సెనేట్​లో ఫిబ్రవరి 8 నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈమేరకు అభిశంసన ఆర్టికల్​ సెనేట్​కు సోమవారం చేరుకోనుంది.

Trump impeachment trial in Senate
సెనేట్​లో ఫిబ్రవరి 8 నుంచి ట్రంప్​ అభిశంసనపై విచారణ

By

Published : Jan 23, 2021, 10:21 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసనపై సెనేట్​లో ఫిబ్రవరి 8 నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈ మేరకు మెజార్టీ నేత చక్​ షుమర్​ తెలిపారు. ఈ అభిశంసన ఆర్టికల్​ను ఈనెల25న సాయంత్రం సెనేట్​లో హౌస్​ మేనేజర్లు చదువుతారని ఆయన​ తెలిపారు. అనంతరం దీనిపై న్యాయపరమైన ఆధారాలను సమర్పించడానికి హౌస్​ మేనేజర్లతో పాటు, ప్రతివాదులకు సమయం ఇస్తారని చెప్పారు.

ఆధారాలు సమర్పించిన అనంతరం దీనిపై ఫిబ్రవరి 8నుంచి పూర్తిస్థాయి విచారణ ఉంటుందని తెలిపారు. అయితే ఇప్పటికే సెనేట్​కు అభిశంసన ఆర్టికల్​ను ఈ నెల 25న పంపిస్తున్నట్లు ప్రతినిధుల సభ స్పీకర్​ నాన్సీ పెలోసి ప్రకటించారు. ప్రస్తుతం డెమొక్రటిక్​, రిపబ్లిక్​ పార్టీలు సెనేట్​లో 50 సీట్లతో సమానంగా ఉన్నాయి. అయితే.. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్​ వేసే ఓటు ఈ​ అభిశంసనలో కీలకం కానుంది.

ఈ అభిశంసన ప్రక్రియతో పాటు ఇతర కార్యకలాపాలు ఏకకాలంలో జరుగుతాయని శ్వేతసౌధ కార్యాలయం ప్రకటించింది. ఈ నెల 6న జరిగిన క్యాపిటల్​ హింసాకాండలో తన మద్దతుదారులను ట్రంప్​ ప్రేరేపించారన్న ఆరోపణలతో డెమొక్రాట్లు మాజీ అధ్యక్షుడిపై అభిశంసన అస్త్రాన్ని ప్రయోగించారు.

ఇదీ చూడండి:అమెరికా రక్షణ మంత్రిగా తొలిసారి నల్లజాతీయుడు

ABOUT THE AUTHOR

...view details