మాదక ద్రవ్యాలు సరఫరా, అక్రమంగా రవాణా చేసే దేశాల జాబితాలో భారత్‌ను చేర్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బహమాస్, అఫ్గానిస్థాన్, కొలంబియా, బర్మా, కోస్టా రికా, పెరూ ఇలాంటి 20 దేశాల్లో భారత్ కూడా ఉందని అన్నారు.
డ్రగ్స్ కార్యకలాపాలతో సంబంధమున్న నేరపూరిత సంస్థలను విడిచిపెట్టేది లేదని ట్రంప్ ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాల మహమ్మారి కట్టడిలో అమెరికా తన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక ఒప్పందాలకు అనుగుణంగా.. బొలీవియా, వెనిజువెలా తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు ట్రంప్. డ్రగ్స్ నియంత్రణ కోసం ఈ దేశాలు చర్యలేవీ తీసుకోలేదని మండిపడ్డారు. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోనే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు ట్రంప్. ఆయనను ఓ నియంతగా పేర్కొన్నారు.
'కోకా సాగు పెరిగిపోతోంది'