తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్, చైనా వివాదాల పరిష్కారంలో సాయానికి సిద్ధం' - భారత్ చైనా యుద్ధం 2020

సరిహద్దు వివాదాలను భారత్​, చైనా పరిష్కరించుకోగలుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అమెరికా సాయం కావాలని వారు భావిస్తే అందుకు ఎంతో సంతోషిస్తామని తెలిపారు.

US-TRUMP-INDIA-CHINA
డొనాల్డ్ ట్రంప్

By

Published : Sep 25, 2020, 8:26 AM IST

భారత్​, చైనా విభేదాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ప్రస్తుత సరిహద్దు వివాదాలను ఇరు దేశాలు పరిష్కరించుకోగలవని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పునరుద్ఘాటించారు.

లద్దాఖ్​లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్​, చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగిన భేటీ నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ భేటీలో అదనపు బలగాల మోహరింపును నిలిపేసేందుకు ఇరువైపులా అంగీకరించాయి.

సముద్రంపై నిఘా..

అయితే, సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్​ వివిధ అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని ప్రముఖ అమెరికన్​ పత్రిక నివేదించింది. హిందూ మహాసముద్రంలో నిఘా పెంచుతోందని తెలిపింది. అమెరికా సహా ఇతర మిత్రపక్షాలతో ఇక్కడ సంయుక్త నావికా విన్యాసాలు చేపడుతోందని వివరించింది.

ఇదీ చూడండి:చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు!

ABOUT THE AUTHOR

...view details